అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో, గన్నవరంలోని మేధాటవర్స్‌లోనూ ఏర్పాటుచేసిన దేశంలోనే మొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు 2026, ఏప్రిల్ 14న ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. దేశీయ పరిజ్ఞానంతో తయారుచేసిన క్వాంటమ్ కంప్యూటర్లతో రిఫరెన్స్ ఫెసిలిటీస్ ఏర్పాటుచేయడం క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో మన దేశం వేసిన పెద్ద ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. క్వాంటమ్, ఏఐ, సెమీకండక్టర్ల లాంటివి ఇకపై భారత్ అభివృద్ధి ప్రయాణంలో అంతర్భాగాలని సీఎం తెలిపారు.