పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ 2026-27లో 6.5 శాతం మేర వృద్ధి సాధించొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఈ యుద్ధం కారణంగా ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వేగం మందగించిందని, దీంతో 2025తో పోలిస్తే 2026లో అంతర్జాతీయ వృద్ధి తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది. జనవరిలో అంచనా వేసిన వృద్ధి అంచనా 3.4 శాతం కాగా, దాన్ని తాజాగా 3.1 శాతానికి తగ్గించింది.