రోజురోజుకీ తీవ్రమవుతున్న సైబర్ నేరాలను నియంత్రించేందుకు ‘ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్(ఐడీపీఐసీ)’ అనే వ్యవస్థను ఏర్పాటు కానుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)ల నేతృత్వంలో రూపొందుతోన్న ఈ ప్లాట్‌ఫాం డిజిటల్ చెల్లింపు వ్యవస్థలకు నిఘా కేంద్రంగా పనిచేయనుంది.
రూ.500కోట్ల అధీకృత మూలధనం, రూ.200కోట్ల చెల్లింపు మూలధనంతో ఐడీపీఐసీని లాభాపేక్ష లేని సంస్థగా, సెక్షన్ 8 కంపెనీగా స్థాపించేందుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. ఎస్‌బీఐ, బీవోబీలు రూ.10కోట్ల చొప్పున ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాయి.