దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో 2025 ఏప్రిల్ 1నాటికి 46గా ఉన్న నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 38కి తగ్గినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా సమీక్షలో పేర్కొంది. వీటిలో 11 జిల్లాలు మాత్రమే వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నట్లు తెలిపింది. కేవలం 4 జిల్లాల్లో వామపక్ష తీవ్రవాదం ఆందోళనకరంగా ఉన్నట్లు వెల్లడైంది.
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్, ఝార్ఖండ్‌లోని పశ్చిమసింగ్‌భూమ్, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్, మహారాష్ట్రలోని గడ్చిరోలి ఈ జాబితాలో ఉన్నాయి.