భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, అక్టోబరు 30న ఉత్తర్వులు జారీచేశారు. ఈయన నవంబరు 24న సీజేఐగా పదవీ ప్రమాణం చేస్తారు. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగుతారు. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చంద్రచూడ్ తర్వాత అత్యధిక కాలం సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు నిర్వహించబోతున్నారు.