తజికిస్థాన్‌లోని ఐనీ వైమానిక స్థావరంలో కార్యకలాపాలకు భారత్ స్వస్తి చెప్పింది. గతంలో అఫ్గాన్ అంతర్యుద్ధంలో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడిన నార్తర్న్ అలయన్స్‌కు తోడ్పాటు అందించడానికి భారత్ ఈ స్థావరాన్ని ఉపయోగించుకుంది. తజిక్ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం కింద అక్కడి రన్‌వేని పటిష్టపరిచింది. సుఖోయ్ యుద్ధ విమానాలనూ మోహరించింది.
తజిక్ ప్రభుత్వంతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం గడువు ముగియడంతో ఐనీ నుంచి వైదొలగుతున్నట్లు 2025, అక్టోబరు 29న భారత్ తెలిపింది.