విద్యుదుత్పత్తిలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో అన్ని వనరుల నుంచి కలిపి ఉత్పత్తి చేసే విద్యుత్తు 500 గిగావాట్లను దాటింది. 2014 మార్చి 31 నాటికి 249 గిగావాట్లున్న దేశ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 2025 సెప్టెంబరు 30 నాటికి 500.89 గిగావాట్లకు చేరినట్లు కేంద్ర విద్యుత్తుశాఖ 2025, అక్టోబరు 29న తెలిపింది.
ఇందులో పునరుత్పాదక, జల, అణు విద్యుత్తు వాటా 256.09 గిగావాట్లు (51%) ఉండగా, శిలాజ వనరుల నుంచి తయారయ్యే విద్యుత్తు వాటా 244.80 గిగావాట్లు (49%)గా ఉంది.