లోక్‌సభ స్థానాల గరిష్ఠ సంఖ్య

లోక్‌సభ స్థానాల గరిష్ఠ సంఖ్య
  • మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలుగా ఇప్పుడున్న లోక్‌సభ స్థానాల గరిష్ఠ సంఖ్య (550)ని గరిష్ఠంగా 850 వరకూ పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే వారి సంఖ్యను 815గా, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 35గా పేర్కొంది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 81ని సవరించాలని నిర్ణయించింది.
  • దీని ప్రకారం దేశంలో లోక్‌సభ స్థానాలు 54.54% మేర పెరిగే అవకాశముంది. ఇప్పటివరకూ ఆర్టికల్‌ 81(1) కింద రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే గరిష్ఠ లోక్‌సభ సభ్యుల సంఖ్య 530, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే వారి గరిష్ఠ సంఖ్య 20గా ఉన్నాయి. అయితే ప్రస్తుతం 543 లోక్‌సభ స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram