జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ కమిషన్‌ గడువు పెంపు

జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ కమిషన్‌ గడువు పెంపు
  • రాష్ట్రపతి ఉత్తర్వుల్లో లేని మతం స్వీకరించిన వారికి ఎస్సీ హోదా కల్పించడంపై అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ నేతృత్వంలో ఏర్పడిన ఏకసభ్య కమిషన్‌ గడువును కేంద్రం 2026 జూన్‌ 10 వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
  • చారిత్రాత్మకంగా ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న మతాలు కాకుండా ఇతర మతాలకు మారినప్పుడు వారికి ఎస్సీ హోదా కొనసాగించాలా? లేదా? అన్న అంశంపై అధ్యయనం చేయడానికి 2022 అక్టోబరు 6న కేంద్రం జస్టిస్‌ బాలకృష్ణన్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram