ఇరాన్‌

ఇరాన్‌
  • ఇంటర్నెట్‌ పర్యవేక్షణ సంస్థ ‘నెట్‌బ్లాక్స్‌’ అంచనా ప్రకారం.. 864 గంటలపాటు ఏకధాటిగా (36 రోజులపాటు) ఈ సేవలు నిలిపివేసిన దేశంగా ఇరాన్‌ నిలిచింది. దీంతో ఆ దేశ ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అమెరికా-ఇజ్రాయెల్‌ల దాడులు మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను ఇరాన్‌ నిలిపివేసింది. గత అయిదు వారాలుగా ఈ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశీయంగా పరిమిత స్థాయిలోనే ఈ సేవలు ఉన్నాయి.
  • మయన్మార్, సూడాన్‌తో పాటు పలు దేశాల్లో సంక్షోభ సమయాల్లో ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించినప్పటికీ.. ఇంత సుదీర్ఘ కాలం పాటు ఏ దేశంలోనూ కొనసాగలేదని ‘నెట్‌బ్లాక్స్‌’ పేర్కొంది. ఉత్తర కొరియా మాత్రం ఇంటర్నెట్‌ ద్వారా ప్రపంచంతో అనుసంధానం కాకుండా మొదటి నుంచీ దూరంగా ఉందని తెలిపింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram