మానవరహిత గగనతల వ్యవస్థ (యూఏవీ) నుంచి అత్యంత కచ్చితత్వంతో కూడిన గైడెడ్ క్షిపణిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ లాంచ్డ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ (యూఎల్‌పీజీఎం)-వీ3 అనే ఈ అస్త్రాన్ని కర్నూలులో ఉన్న డీఆర్‌డీవో పరీక్ష కేంద్రం నుంచి ప్రయోగించింది. ఇందులో నింగి నుంచి నేల, నింగి నుంచి నింగిలోని లక్ష్యాలను ఛేదించే వెర్షన్లను పరీక్షించి చూశారు.