ప్రపంచవ్యాప్తంగా తాగునీటిలో ఆందోళనకరంగా మారిన సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులను సులువుగా, పర్యావరణహిత మార్గంలో తొలగించడానికి అమెరికాలోని మిస్సౌరీ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జన్యు మార్పిడి ద్వారా సరికొత్త ఆల్గేను (పాచి) తయారు చేశారు. ఈ ఆల్గే లిమోనెన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సహజసిద్ధంగా ఉత్పత్తయ్యే నూనె. కమలా పండ్లలో సువాసనకు ఇదే కారణం.
ఈ పదార్థం వల్ల ఆల్గేకు నీటిని వికర్షించే లక్షణం వస్తుంది. మైక్రో ప్లాస్టిక్స్‌కూ ఇదే గుణం ఉంటుంది. అందువల్ల అవి వెంటనే నీటిలో ఆల్గేకు అతుక్కుపోతాయి.
ఈ పరిణామంవల్ల సూక్ష్మ రేణువులన్నీ ఒక సమూహంలా ఏర్పడతాయి. నీటి కిందికి జారిపోతాయి. తద్వారా వాటిని చాలా సులువుగా తొలగించేయవచ్చు.