‘ఆర్టెమిస్‌-2’

‘ఆర్టెమిస్‌-2’
  • అయిదు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ చందమామ వైపు మానవసహిత యాత్ర ప్రారంభమైంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసాకు చెందిన ప్రతిష్ఠాత్మక ‘ఆర్టెమిస్‌-2’ మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన రాకెట్‌ కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి 2026, ఏప్రిల్‌ 2న నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వ్యోమగాములు దాదాపు 25 గంటలపాటు భూమి చుట్టూ పరిభ్రమించి.. అనంతరం జాబిల్లి దిశగా ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారు. 10 రోజులపాటు సాగే ఈ యాత్రలో భాగంగా.. వారు చంద్రుడిని దాటి ఆవల కూడా వేల కిలోమీటర్లు ప్రయాణిస్తారు. మొత్తంగా 4 లక్షల కిలోమీటర్లకుపైగా దూరం వెళ్లాక యూటర్న్‌ తీసుకొని భూమికి తిరిగొస్తారు. ఈ మిషన్‌లో వ్యోమగాములు జాబిల్లిపై కాలు మోపరు. చందమామపై మళ్లీ మానవులను దించాలని, అక్కడ మానవ శాశ్వత ఉనికిని ఏర్పాటుచేయాలని నాసా రచిస్తున్న బృహత్‌ ప్రణాళికలకు ఆర్టెమిస్‌-2 ఆరంభం లాంటిది. 2028 కల్లా చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద తమ వ్యోమగాములను దించాలని ఆ సంస్థ భావిస్తోంది.
  • ఆర్టెమిస్‌-2 కమాండర్‌గా రీడ్‌ వైస్‌మాన్‌ వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు పైలట్‌ విక్టర్‌ గ్లోవర్, మరో ఇద్దరు వ్యోమగాములు క్రిస్టీనా కోచ్, జెరెమీ హాన్సన్‌ ఈ మిషన్‌లో భాగంగా నింగిలోకి దూసుకెళ్లారు. వీరిలో హాన్సన్‌ మినహా మిగతా ముగ్గురూ అమెరికన్లే. జాబిల్లి దిశగా చేపట్టిన మానవసహిత యాత్రలో పాలుపంచుకున్న తొలి మహిళగా క్రిస్టీనా కోచ్‌ రికార్డు సృష్టించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram