ఇరాక్‌ అధ్యక్షుడిగా నిజార్‌ అమిది

ఇరాక్‌ అధ్యక్షుడిగా నిజార్‌ అమిది

ఇరాక్‌ అధ్యక్షుడిగా కుర్దు నాయకుడు నిజార్‌ అమిది ఎన్నికయ్యారు. ఆయన పేట్రియాటిక్‌ యూనియన్‌ ఆఫ్‌ కుర్దిస్థాన్‌ పార్టీ నేత. ఇరాక్‌లో ఐదు నెలల క్రితం పార్లమెంటు ఎన్నికలు జరిగినా అందులో ఏ ఒక్క పార్టీకీ పూర్తి మెజారిటీ లభించలేదు. దీంతో 2026, ఏప్రిల్‌ 11న అధ్యక్ష పదవికి జరిగిన ఓటింగులో ఒక్క అభ్యర్థికీ మొదటి రౌండులో మూడింట రెండొంతుల ఓట్లు లభించలేదు. అయితే పోటీకి నిలిచిన అభ్యర్థులందరిలోకీ నిజార్‌ అమిదికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన అధ్యక్షునిగా ఎన్నికైనట్టు ప్రకటించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram