తెలంగాణ సామాజిక, ఆర్థిక కుటుంబ సర్వే

తెలంగాణ సామాజిక, ఆర్థిక కుటుంబ సర్వే
  • రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సామాజిక, ఆర్థిక కుటుంబ సర్వే (సీపెక్‌) సంపూర్ణ డేటాను, నిపుణుల కమిటీ నివేదికను 2026, ఏప్రిల్‌ 15న విడుదల చేసింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేపట్టింది. రాష్ట్రంలోని 1,12,36,849 కుటుంబాలను సర్వే చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 97.10 శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. 1.03 లక్షల మంది ఉద్యోగులు పనిచేశారు. సర్వేకు దాదాపు 3.55 కోట్ల మంది ప్రజలు స్పందించారు. వారిచ్చిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా తీసుకుని నివేదిక రూపొందించింది. 
  • తెలంగాణ ప్రణాళిక శాఖ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టారు. కులం, మతం, విద్య, ఉపాధి, భూమి, ఆస్తులు, వలసలు..ఇలా కీలక సమాచారం సేకరించారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, కంచ ఐలయ్య ఇతర ప్రముఖులు, నిపుణులతో ఒక కమిటీని వేయగా అది నివేదికనూ ప్రభుత్వానికి సమర్పించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram