ఇంజినీరింగ్‌ ఎగుమతుల్లో

ఇంజినీరింగ్‌ ఎగుమతుల్లో
  • కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్‌ ఇంపోర్టు-ఎక్స్‌పోర్టు రికార్డు ఫర్‌ ఇయర్లీ ఎనాలిసిస్‌ ఆఫ్‌ ట్రేడ్‌ పోర్టల్‌లో పొందుపరిచిన గణాంకాల ప్రకారం... 2023-24 నుంచి 2024-25 మధ్య తెలంగాణ రాష్ట్రం.. దేశంలో ఇంజినీరింగ్‌ ఎగుమతుల్లో అత్యధికంగా 117.9% వృద్ధిని నమోదు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. విమాన విభాగాలు, రక్షణ పరికరాలు, పరిశ్రమ యంత్రాలు వంటి ఇంజినీరింగ్‌ వస్తువుల ఎగుమతుల్లో రాష్ట్రం గణనీయమైన వృద్ధి రేటుని నమోదు చేసింది. కేవలం రెండేళ్లలోనే ఈ ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 
  • 2022-23లో 1,827 మిలియన్‌ డాలర్లుగా ఉన్న ఎగుమతులు.. 2024-25 నాటికి 7,536 మిలియన్‌ డాలర్లకు చేరి... 103% వార్షిక సమ్మిళిత వృద్ధి రేటును నమోదు చేశాయి. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల సగటు వృద్ధి కేవలం 10% మాత్రమే ఉంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram