‘పేరెంటల్‌ సపోర్ట్‌ యాక్ట్‌-2026’

‘పేరెంటల్‌ సపోర్ట్‌ యాక్ట్‌-2026’
  • తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధుల శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‘తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ చట్టం -2026’ బిల్లును 2026, మార్చి 29న శాసనసభలో ప్రవేశపెట్టగా చర్చ అనంతరం సభ ఆమోదం తెలిపింది. తల్లిదండ్రుల యోగక్షేమాలను చూడని, వారికి సేవ చేయని ఉద్యోగుల నుంచి పోషణ నిమిత్తం వారి నెల వేతనంలో 15 శాతం లేదా రూ.10 వేలు(ఏది తక్కువైతే అది) చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తెచ్చింది. 
  • చట్టరూపం దాల్చిన తర్వాత ఏర్పాటయ్యే కమిషన్‌కు హైకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా వయోవృద్ధుల కమిషన్‌ కార్యాలయంలో కమిషనర్‌గా పనిచేసిన వ్యక్తిని ప్రధాన కమిషనర్‌గా నియమించనున్నారు. మరొకరిని కమిషనర్‌గా నియమించనున్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram