నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ 2026

నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ 2026

కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ- నెట్స్‌ 2026 పథకానికి ఎన్‌టీఏ ప్రకటనను జారీ చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సీ బాలబాలికలు సీబీఎస్‌ఈ అనుబంధ ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో తొమ్మిది, పదకొండు తరగతుల్లో ప్రవేశాలు పొందవచ్చు. శ్రేష్ఠ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 3వేల సీట్లను భర్తీ కానున్నాయి. 

వివరాలు:

శ్రేష్ఠ (స్కీం ఫర్‌ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్‌ స్టూడెంట్స్‌ ఇన్‌ హై క్లాసెస్‌ ఇన్‌ టార్గెటెడ్‌ ఏరియాస్‌)- 2026

అర్హతలు: 2025-26 విద్యా సంవత్సరంలో 8, 10వ తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు.

వయోపరిమితి: తొమ్మిదో తరగతికి 01-04-2010 నుంచి 31-03-2014 మధ్య జన్మించి ఉండాలి (అంటే 31.03.2026 నాటికి 16 నుంచి 12 సంవత్సరాల వయసు ఉండాలి).

పదకొండో తరగతి విద్యార్థులు 01-04-2008 నుంచి 31-03-2012 మధ్య జన్మించి ఉండాలి (అంటే 31.03.2026 నాటికి 18 నుంచి 14 సంవత్సరాల వయసు ఉండాలి)

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 09.11.2025. 

దరఖాస్తు సవరణలకు అవకాశం: నవంబర్‌ 11 నుంచి 12 వరకు.

ప్రవేశ పరీక్ష తేదీ: డిసెంబర్‌ 21. 

Website:https://exams.nta.ac.in/SHRESHTA/

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram