దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026

దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026

ఆంధ్రప్రదేశ్‌, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (డీఎస్‌ఎన్‌ఎల్‌యూ) 2026- 27 విద్యాసంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థుల కోసం 3-సంవత్సరాల ఎల్‌ఎల్‌.బి. (LL.B.) కోర్సు ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ- మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రవేశాలు 2026-27

మొత్తం సీట్ల సంఖ్య: ఈ కోర్సులో మొత్తం 66 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 60 రెగ్యులర్ సీట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటా కింద 6 సూపర్‌న్యూమరరీ సీట్లు.

అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా దానికి సమానమైన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం 45%, బీసీ అభ్యర్థులకు 42%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 40% మార్కులు సాధించి ఉండాలి. ఒకవేళ మొదటి గ్రాడ్యుయేషన్‌లో ఈ మార్కులు రాకపోతే, అదనపు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) లో పేర్కొన్న మార్కుల శాతాన్ని సాధించినా అర్హులుగా పరిగణిస్తారు. దీనితో పాటు అభ్యర్థులు యూనివర్సిటీ నిర్వహించే డీఈటీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (www.dsnlu.ac.in) లో అప్‌లోడ్ చేసిన దరఖాస్తు ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది. 

పరీక్ష ఫీజు: జనరల్ (OC) అభ్యర్థులు రూ.2,500, బీసీ/ఓబీసీ అభ్యర్థులు రూ.2,200, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ1,800. ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలి. ఈ రుసుమును యూనివర్సిటీ నిర్దేశించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సబ్బవరం బ్రాంచ్ లోని సేవింగ్స్ ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది.

పరీక్ష విధానం: ఈ పరీక్ష 100 మార్కులకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, లీగల్ ఆప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష కేవలం ఇంగ్లిష్ మాధ్యమంలోనే ఉంటుంది.

పరీక్ష కేంద్రం: డీఎస్‌ఎన్‌ఎల్‌యూ విశాఖపట్నం.

దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 21.06.2026.

ప్రవేశ పరీక్ష తేదీ: 28.06.2026.

Website:https://dsnlu.ac.in/3-year-ll-b-notification-application-2026-27/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram