ఐఎంయూలో డిప్లొమా, యూజీ, పీజీ కోర్సులు

ఐఎంయూలో డిప్లొమా, యూజీ, పీజీ కోర్సులు

భారత ప్రభుత్వ పోర్ట్స్‌, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ (ఐఎంయూ) 2026-27 విద్యాసంవత్సరానికి దేశవ్యాపంగా గల 6 ప్రధాన క్యాంపస్‌లైన చెన్నై, కొచ్చి, కోల్‌కతా, ముంబయి, నవీ ముంబయి, విశాఖపట్నంతో పాటు ఇతర అనుబంధ సంస్థల ద్వారా పీజీ, యూజీ, డీఎన్‌ఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తుంది. ఐఎంయూ సెట్‌ ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. 

వివరాలు: 

పీజీ, యూజీ (బీటెక్‌, బీఎస్సీ), డిప్లొమా ఇన్‌ నాటికల్‌ సైన్స్‌ (డీఎన్‌ఏస్‌).

1. స్కూల్‌ ఆఫ్‌ నాటికల్‌ స్టడీస్‌- డీఎన్‌ఎస్‌, బీఎస్సీ(నాటికల్‌ సైన్స్‌): 

2. స్కూల్ ఆఫ్ మెరైన్ ఇంజినీరింగ్ అండ్‌ టెక్నాలజీ- బీటెక్‌, ఎంటెక్‌, పీజీడీఎంఈ.

3. స్కూల్ ఆఫ్ నావల్ ఆర్కిటెక్చర్ అండ్‌ ఓషియన్‌ ఇంజినీరింగ్‌ (బీటెక్‌, ఎంటెక్‌)

4. స్కూల్ ఆఫ్ మారిటైం మేనేజ్‌మెంట్‌: బీబీఏ, ఎంబీఏ 

విభాగాలు: మెరైన్‌ ఇంజినీరింగ్‌, నావల్‌ అర్కిటెక్చర్ అండ్‌ ఓషియన్‌ ఇంజినీరింగ్‌, నావల్‌ అర్కిటెక్చర్‌ అండ్‌ షిప్‌ బిల్డింగ్‌, నాటికల్‌ సైన్స్‌, అప్లైడ్‌ న్యూట్రికల్‌ సైన్స్, నావల్‌ అర్కిటెక్చర్‌ అండ్ ఓషియన్‌ ఇంజినీరింగ్‌, డ్రెడ్జింగ్ అండ్ హార్బర్‌ ఇంజినీరింగ్‌, మెరైన్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌పోర్టెషన్ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌, పోర్ట్‌ అండ్‌ షిప్పింగ్‌ మేనేజ్‌మెంట్‌.

అర్హత: యూజీ కోర్సులకు 10+2 లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో 60% మార్కులు ఉండాలి లేదా చెల్లుబాటు అయ్యే జేఈఈ (మెయిన్‌) ర్యాంక్ ఉండాలి. బీబీఏ కోర్సు కోసం 10+2 లో 50% మార్కులు, ఇంగ్లిష్‌లో కనీసం 50% మార్కులు అవసరం.

పీజీ కోర్సుల (ఎంటెక్‌/ఎంబీఏ) కోసం కనీసం 55% నుంచి 60% మార్కులతో సంబంధిత డిగ్రీ ఉండాలి.

ఎంపిక విధానం: ఐఎంయూ సెట్‌లో ద్వారా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 24.04.2026.

ఐఎంయూ సెట్‌ పరీక్ష తేదీ: మే 24న పరీక్ష.

తరగతులు ప్రారంభం: 01.08.2026.

Website:https://www.imu.edu.in/imunew/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram