ఎంఎస్‌ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు

ఎంఎస్‌ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు

భారత ప్రభుత్వ రంగ సూక్ష్మ, చిన్న, మధ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని విశాఖపట్నంలోని మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం టెక్నాలజీ సెంటర్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి మూడేళ్ల అడ్వాన్స్‌డ్‌ డై అండ్‌ మౌల్డ్‌ మేకింగ్‌, మెకట్రానిక్స్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

1. డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్‌ డై అండ్‌ మౌల్డ్ మేకింగ్ (డీఏడీడీఎంఎం): 60 సీట్లు

2. డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్‌ మెకట్రానిక్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ (డీఏఎంఐఏ)- 60 సీట్లు

వ్యవధి: మూడేళ్లు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత. (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 45శాతం) టెన్త్‌ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 01-07-2026 నాటికి 22 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు మూడేళ్ల వయో సడలింపు వర్తిస్తుంది. 

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, మెరిట్‌జాబితా, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ /ఆన్‌లైన్ మోడ్ ద్వారా.

ప్రవేశ పరీక్ష విధానం: పరీక్ష ఆఫ్‌లైన్‌ అబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. 

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 30.04.2026.

ప్రవేశ పరీక్ష తేదీ: 03.05.2026.

ఫలితాలు: 09.05.2026.

అడ్మిషన్‌ అండ్‌ కౌన్సలింగ్‌: 02.06.2026.

కోర్సు ప్రారంభం: 16.06.2026.

Website:https://www.msmetcvizag.org/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram