ఐఆర్‌సీటీసీలో హాస్పిటాలిటీ మానిటర్స్‌ ఉద్యోగాలు

ఐఆర్‌సీటీసీలో హాస్పిటాలిటీ మానిటర్స్‌ ఉద్యోగాలు

ఐఆర్‌సీటీసీ చెన్నై జోనల్‌ ఆఫీస్‌ ఒప్పంద ప్రాతిపదికన హాస్పిటాలిటీ మానిటర్స్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

హాస్పిటాలిటీ మానిటర్స్‌: 84 పోస్టులు

అర్హత: బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ సైన్స్‌, సంబంధిత విభాగాల్లో బీఎస్సీ, బీబీఏ/ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్: నెలకు రూ.30,000.

వయోపరిమితి: 01.04.2026 నాటికి 27 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు: 25, 27 & 28/04/2026.

వేదిక: 6ఏ, ది రేయిన్ ట్రీ, నంబర్‌9, ఎంసీ నికోల్స్‌ రోడ్‌, చెట్‌పేట్‌, చెన్నై.

Website: https://irctc.com/new-openings.php

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram