డీఆర్‌డీఓ- ఐటీఆర్‌లో పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు

డీఆర్‌డీఓ- ఐటీఆర్‌లో పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు

చాందీపూర్‌, బాలాసోర్‌లోని డీఆర్‌డీఓకు చెందిన ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) ఆరు నెలల కాలానికి బీటెక్‌, ఎంటెక్‌, ఎంఎస్సీ చివరి ఏడాది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  

వివరాలు:

పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌: 27 ఖాళీలు

వ్యవధి: 6 నెలలు.

స్టైపెండ్‌: రూ.5,000.

అర్హత: చివరి ఏడాది చదువుతున్న బీటెక్‌/ఎంటెక్‌, ఎంఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌/ఈసీఈ, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌.

ఎంపిక విధానం: విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా డైరెక్టర్‌ ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ డిఫెన్స్‌ ఆర్‌ అండ్‌ డీ ఆర్గనైజేషన్‌, చంఢీపుర్‌, బాలాసోర్‌, ఒడిశా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 25.06.2026.

Website:https://drdo.gov.in/drdo/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram