ఎస్‌ఎం పోర్టులో స్పోర్ట్స్‌పర్సన్ ఉద్యోగాలు

ఎస్‌ఎం పోర్టులో స్పోర్ట్స్‌పర్సన్ ఉద్యోగాలు

శ్యామ్‌ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్, కోల్‌కతా (ఎస్‌ఎంపీకే) ఒప్పంద ప్రాతిపదికన స్పోర్ట్స్‌ పర్సన్‌ల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

స్పోర్ట్స్‌ పర్సన్: 26

క్రీడల వారీగా ఖాళీలు:

కోల్‌కతా డాక్ సిస్టమ్ (పురుషులకు మాత్రమే): హాకీ (5), ఫుట్‌బాల్ (5), బాస్కెట్‌బాల్ (3), వాలీబాల్ (3), క్రికెట్ (5). హల్దియా డాక్ కాంప్లెక్స్: టేబుల్ టెన్నిస్ (2), బ్యాడ్మింటన్ (3).

అర్హతలు: టెన్త్ క్లాస్ (Standard X) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 31.03.2026 తేదీ నాటికి ముగిసిన మునుపటి కాలంలో కనీసం ఒక్కసారైనా సంబంధిత క్రీడలో జాతీయ స్థాయిలో రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 26 ఏళ్లు.

వేతనం: నెలకు రూ.50,000.

ఎంపిక విధానం: దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన వారికి ఫిజికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను వయస్సు, విద్యార్హతలు, క్రీడా విజయాల ధ్రువీకరణ పత్రాల నకళ్లతో జతచేసి హార్డ్ కాపీ రూపంలో పంపాలి. దరఖాస్తులను "Application for engagement as Sportsperson (on contract)" అని కవరుపై రాసి, 'Sr. Dy. Secretary-I, Syama Prasad Mookerjee Port, Kolkata, 15, Strand Road, Kolkata 700001' చిరునామాకు పంపించాలి.  

దరఖాస్తుకు చివరి తేదీ: 2026 జూన్‌ 15.

Website:https://smp.smportkolkata.in/smpk/en/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram