రైల్వేలో ఉద్యోగాలు

రైల్వేలో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ), దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (CEN No. 01/2026) విడుదల చేసింది. 

వివరాలు:

అసిస్టెంట్‌ లోకోపైలట్‌ (ఏఎల్‌పీ): 11,127

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదో తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ITI) లేదా డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. చివరి ఏడాది పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్న వారు దరఖాస్తుకు అనర్హులు.  

వయోపరిమితి: 2026 జులై 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ (NCL) అభ్యర్థులకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు 7వ పే కమిషన్ ప్రకారం పే లెవల్-2 కింద ప్రారంభ వేతనంగా నెలకు రూ.19,900 తో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి.

దరఖాస్తు విధానం: కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఏదైనా ఒక ఆర్ఆర్‌బీ (RRB) కి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీలు & వెనుకబడిన తరగతుల (EBC) అభ్యర్థులకు రూ.250. (మొదటి దశ పరీక్షకు హాజరైన తర్వాత ఈ మొత్తం తిరిగి చెల్లిస్తారు.) మిగిలిన అభ్యర్థులందరికీ రూ.500. (పరీక్షకు హాజరైన తర్వాత రూ.400 తిరిగి చెల్లిస్తారు).

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను మొత్తం ఐదు దశల్లో ఎంపిక చేస్తారు. 

మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1).

రెండవ దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-2).

కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT).

డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV).

మెడికల్ ఎగ్జామినేషన్ (ME).

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 15, 2026.  

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 14, 2026 (రాత్రి 11:59 గంటల వరకు).  

ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూన్ 16, 2026.  

దరఖాస్తు సవరణ గడువు: జూన్ 17 నుంచి జూన్ 26, 2026 వరకు. 

Website:https://rrbsecunderabad.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram