సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) సెప్టెంబర్‌-2026

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) సెప్టెంబర్‌-2026

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకినాకి అర్హత పరీక్ష అయిన సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సబీఎస్‌ఈ) దీన్ని నిర్వహిస్తుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత తరగతుల్లో బోధించాలని ఆశించే అభ్యర్థులకు ఇది తప్పనిసరి అర్హత.  

వివరాలు:

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్‌) సెప్టెంబర్‌-2026

పరీక్ష విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్​ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్​ ఆరు నుంచి ఎనిమిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ లైఫ్​ లాంగ్​ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ దేశంలోని కేవీఎస్‌, ఎన్‌వీఎస్‌, సెంట్రల్‌ స్కూళ్లతో పాటు సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో, కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. 

అర్హతలు: ఇంటర్మీడియట్‌తో పాటు డీఈఎల్‌ఈడీ/ బీఈఎల్‌ఈడీ; డిగ్రీ డీఈడీ (ప్రత్యేక విద్య), బీఈడీ, బీఈడీ(ప్రత్యేక విద్య), / బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ, ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ కేటగిరీలకు రూ.1000(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200(పేపర్ 1 & 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600(పేపర్ 1 & 2 రెండూ).

పరీక్ష విధానం: పేపర్‌-2 ఉదయం 9:30 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1 మద్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్‌, నిజామాబాద్, అనంతపురం, గుంటూరు, ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.05.2026

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 10.06.2026.

ఫీజు చెల్లింపు చివరి తేది: 10.06.2026

ఆన్‌లైన్‌ దరఖాస్తుల సవరణ తేదీలు: 15.06.2026 - 18.06.2026.

ఓఎమ్మార్‌ ఆధారిత పరీక్ష తేదీ: 06.09.2026.

పరీక్ష ఫలితాలు: అక్టోబర్‌ చివర్లో (తాత్కాలిక).

Website:https://ctet.nic.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram