ఇండియన్ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఐటీ ఆఫీసర్ ఉద్యోగాలు

ఇండియన్ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఐటీ ఆఫీసర్ ఉద్యోగాలు

కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ)లో 2027, జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌) కోసం అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఇండియన్ నేవీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) 2027 జనవరి కోర్సు

మొత్తం ఖాళీల సంఖ్య: 15 (తాత్కాలికం)

అర్హత: అభ్యర్థులు టెన్త్‌ లేదా ఇంటర్‌లో ఇంగ్లిషులో కనీసం 60% మార్కులు కలిగి ఉండాలి. దీనితో పాటు కనీసం 60% బీసీఏ/బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఐటీతో పాటు ఎంసీఏ చేసి ఉండాలి బీఈ/బీటెక్‌/ఎంఎస్సీ/ఎంటెక్‌(కంప్యూటర్ సైన్స్, ఐటీ, సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉత్తీర్ణత లేదా చివరి ఏడాది చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రారంభ వేతనం: నెలకు రూ.56100, ఇతర అలవెన్సులు.

వయోపరిమితి: అభ్యర్థులు 01.01.2002 నుంచి 01.07.2007 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 16.05.2026.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.06.2026.

ముఖ్యాంశాలు:

ఎన్‌సీసీ అభ్యర్థులు 'సి' సర్టిఫికేట్ (కనీసం 'బీ' గ్రేడ్) ఉన్నవారికి కటాఫ్ మార్కులలో 5% సడలింపు ఉంటుంది.  

సర్వీస్ కాలం: ప్రారంభంలో 10 సంవత్సరాలు, అవసరాన్ని బట్టి మరో 4 సంవత్సరాలు (2+2) పొడిగించే అవకాశం ఉంటుంది.  

ఎంపికైన వారు 6 వారాల పాటు కేరళలోని ఎజిమల లో శిక్షణ పొందాలి.  

శిక్షణ సమయంలో వివాహం చేసుకోరాదు. శిక్షణలో ఉండగా వివాహం చేసుకుంటే అభ్యర్థిని తొలగిస్తారు.

Website:https://www.joinindiannavy.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram