ఎస్‌ఎస్‌సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్-XIV

ఎస్‌ఎస్‌సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్-XIV

స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌.. 2026 సంవత్సరానికి సంబంధించి ఫేజ్-XIV/సెలక్షన్ పోస్ట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో వివిధ పోస్టులను భర్తీ చేయనుంది. దీనిలో లాబొరేటరీ అసిస్టెంట్, డిప్యూటీ రేంజర్, లోయర్‌ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్‌, అకౌంటెంట్‌, జూనియర్‌ ఇంజినీర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, మార్కెటింగ్‌ అసిస్టెంట్‌, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, డ్రైవర్‌, స్టోర్‌ కీపర్‌, టెక్నీషియన్లు, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, క్లర్క్‌ ఫార్మసిస్ట్‌, కోర్ట్‌ మాస్టర్‌ వంటి వివిధ పోస్టులున్నాయి. 

వివరాలు: 

ఎస్‌ఎస్‌సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్-XIV - 3003 పోస్టులు

అర్హతలు: పోస్టులను అనుసరించి టెన్త్‌, ఇంటర్మీడియట్, బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకునే చివరి తేదీ నాటికి అవసరమైన విద్యార్హత సర్టిఫికెట్లు కలిగి ఉండాలి.

వయోపరిమితి: పోస్టును బట్టి 01.01.2026 నాటికి 18 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.18,000- రూ.1,50,000.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, స్కిల్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: జనరల్‌ ఇంటలిజెన్స్‌ 25, జనరల్‌ అవేర్‌నెస్‌ 25, క్వాటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌-25, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్-25 చొప్పున  100 ప్రశ్నలకు మొత్తం 200 మార్కులకు ఉంటుంది. మొత్తం 60 నిమిషాల్లో ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కు కోత విధిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.100; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు: 

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 13.04.2026.

దరఖాస్తు చివరి తేదీ: 04.05.2026.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 05.05.2026.

దరఖాస్తు తప్పుల సవరణకు అవకాశం: 11.05.2026- 13.05.2026.

పరీక్ష తేదీ: జూన్‌ 2026(తాత్కాలిక).

Website:https://ssc.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram