రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు

రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ(రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ): 11,127 పోస్టులు

వివరాలు:

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గోరఖ్‌పూర్, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.

అర్హత: సంబంధిత విభాగాలు, ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 01-07-2026 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

ప్రారంభ వేతనం: నెలకు రూ.19900.

ఎంపిక ప్రక్రియ: ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.05.2026.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.06.2026.

Website:https://www.rrbapply.gov.in/#/auth/landing

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram