ఆశా భోస్లే మరణం

ఆశా భోస్లే మరణం
  • ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే (92) 2026, ఏప్రిల్‌ 12న ముంబయిలో మరణించారు. 1933 సెప్టెంబరు 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆమె జన్మించారు. తండ్రి దీనానాథ్‌ మంగేష్కర్‌ సంగీత విద్వాంసుడు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌తోపాటు సింగర్స్‌ ఉషా, మీనా ఆమెకు సోదరీమణులు. సంగీత దర్శకుడు హృదయనాథ్‌ సోదరుడు.  
  • ఆశా తన 10వ ఏటనే ‘మాఝా బాల్‌’ అనే మరాఠీ చిత్రంలో ‘చలా చలా నవ్‌ బాలా’ గీతాన్ని పాడి గాయనిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1948లో ‘చునరియా’ సినిమాలోని ‘సావన్‌ ఆయా’ పాటతో బాలీవుడ్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram