భారత్‌-నార్డిక్‌ చర్చలు

భారత్‌-నార్డిక్‌ చర్చలు
  • విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 2026, మే 19న ఓస్లోలో భారత్‌-నార్డిక్‌ దేశాల మూడో సదస్సులో పాల్గొన్నారు. హరిత సాంకేతికత, నవకల్పనల రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా భారత్‌- నార్డిక్‌ దేశాలు దీర్ఘకాల బంధాన్ని కొనసాగించనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉత్తర ఐరోపాలోని నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, స్వీడన్‌ (నార్డిక్‌) దేశాల అధినేతలు దీనికి హాజరుకాగా మోదీ వారితో చర్చలు జరిపి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 
  • అయిదు దేశాల పర్యటనలో చివరగా నార్వే నుంచి ఆయన ఇటలీకి వెళ్లారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram