వరల్డ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ డే

వరల్డ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ డే

మానవులకు సోకే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో క్షయ ఒకటి. ఇది బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల కలుగుతుంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రమాదకర ఆరోగ్య సమస్యగా పరిణమించింది. క్షయ వ్యాధి వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మార్చి 24న ‘వరల్డ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ డే’గా నిర్వహిస్తారు. ఈ మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చెప్పడం, ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

క్షయ వ్యాధి గురించి..

  • ఈ వ్యాధి మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ (Mycobacterium tuberculosis) అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. జర్మనీకి చెందిన డాక్టర్‌ రాబర్ట్‌ కోచ్‌ అనే వైద్యుడు మొదటిసారి ఈ వ్యాధి కారకాన్ని గుర్తించారు.
  • దీనివల్ల ఊపిరితితుత్తులు ఎక్కువగా ప్రభావితమవుతాయి.
  • దీన్ని రికవరీ డిసీజ్‌ లేదా సైలెంట్‌ కిల్లర్‌ అని కూడా అంటారు.
  • అలసట, జర్వం, శ్లేష్మంతో కూడిన దగ్గు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.
  • వ్యాధిగ్రస్తుల నుంచి గాలి ద్వారా ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది.
  • ఈ వ్యాధి నిర్ధారణకు ‘మాంటెక్స్‌’ పరీక్ష చేస్తారు.
  • దీనికి చేసే చికిత్స: DOTS (Directly Observed Treatment Short Course).
  • క్షయవ్యాధి నివారణకు ఉపయోగించే ముఖ్యమైన సూక్ష్మజీవ నాశకం ‘స్ట్రెప్టోమైసిన్‌’.
  • చిన్న పిల్లలకు ఇది రాకుండా బి.సి.జి టీకాలు (BCG - Bacillus Calmette Guerin) ఇస్తారు.   

క్షయ నిర్మూలనకు భారత ప్రభుత్వ కార్యక్రమాలు..

  • క్షయ వ్యాధి ముందస్తు గుర్తింపు, ఉచిత చికిత్స, పోషకాహార మద్దతు, అవగాహనపై దృష్టి సారిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టింది. వాటిని పరిశీలిస్తే..
  • జాతీయ క్షయ నియంత్రణ కార్యక్రమం (National Tuberculosis Control Programme - NTCP): క్షేత్ర స్థాయిలో క్షయ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించి, దాన్ని నివారించే ఉద్దేశంతో ప్రభుత్వం 1962లో జాతీయ క్షయ నియంత్రణ కార్యక్రమం చేపట్టింది.
  • ని-క్షయ్‌ పోషణ్‌ యోజన (ఎన్‌పీవై): కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షమ మంత్రిత్వ శాఖ 2018, ఏప్రిల్‌ 1న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా టీబీ రోగులకు నెలకు రూ.1000 ఆర్థిక సాయం అందిస్తారు.
  • ని-క్షయ్‌ మిత్ర కార్యక్రమం: దీన్ని 2022, సెప్టెంబరు 9న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ప్రధాన మంత్రి టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ (పీఎంటీబీఎంబీఏ)లో ఇది భాగంగా ఉంది. 

చారిత్రక నేపథ్యం

జర్మనీకి చెందిన డాక్టర్‌ రాబర్ట్‌ కోచ్‌ అనే వైద్యుడు 1882, మార్చి 24న మొదటిసారి క్షయ వ్యాధి కారకమైన మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ను గుర్తించారు. ఇది రోగ నిర్ధా రణ, చికిత్సకు పునాదిగా నిలిచింది. ఇది జరిగిన వందేళ్లకు 1982లో డబ్ల్యూహెచ్‌ఓ, International Union Against Tuberculosis and Lung Disease (IUATLD) సంయుక్తంగా ఆ తేదీని ‘వరల్డ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ డే’గా గుర్తించాయి. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ప్రపంచ క్షయ (టీబీ) దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021), (ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2022)

1) సెప్టెంబరు 24   2) జనవరి 24

3) ఏప్రిల్‌ 24      4) మార్చి 24

సమాధానం: 4

2. క్షయ వ్యాధి చికిత్సలో కింది ఏ యాంటీబయాటిక్‌ను ఉపయోగిస్తారు?

(బిహార్‌ ఎస్‌టీఈటీ పీజీటీ, 2020)

1) పెన్సిలిన్‌            2) స్ట్రెప్టోమైసిన్‌

3) టెట్రాసైక్లిన్‌          4) క్లోరోమైసిటిన్‌

సమాధానం: 2

3. How is tuberculosis spread in humans?
(SSC CHSL, 2022)

1) Inoculation into skin   2) Droplet infection

3) Direct touching           4) Contact with soil

Ans: 2

4. The internationally recommended Directly Observed Treatment Short - course (DOTS) strategy is related to the following disease : 
(Odisha Police SI, 2022), (MP Mahila Supervisor, 2017)

1) Polio   2) AIDS   3) Hepatitis   4) Tuberculosis

Ans: 4

5. Who discovered the TB vaccine?

(SSC MTS, 2021)

1) Edward Jenner

2) Jonas Salk and Camille Guerin

3) Leon Calmette and Camille Guerin

4) Louis Pasteur

Ans: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram