అంతర్జాతీయ శాంతి దినోత్సవం

అంతర్జాతీయ శాంతి దినోత్సవం

దేశాభివృద్ధికి, సమాజ వికాసానికి, మానవాభివృద్ధికి సంఘర్షణలు లేని వాతావరణం అవసరం. శాంతి అంటే కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు. పరస్పర అవగాహన, సహకార స్ఫూర్తితో విభేదాలను పరిష్కరించుకోవడం, మంచి భాగస్వామ్య ప్రక్రియలు మొదలైనవన్నీ ఇందులో భాగమే. ప్రధానంగా ఇది హక్కులను పరిరక్షిస్తూ, మానవ సంబంధాల బలోపేతంపై దృష్టి సారిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా హింసను అరికట్టి, సమాజంలో శాంతియుత పరిస్థితులను పెంపొందించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 21న ‘అంతర్జాతీయ శాంతి దినోత్సవం’గా (International Day of Peace) నిర్వహిస్తారు. దీన్నే ప్రపంచ శాంతి దినోత్సవం (World Peace Day) అని కూడా అంటారు. హింస వల్ల కలిగే నష్టాల గురించి విద్య ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు సామరస్యం, పరస్పర గౌరవం ఆవశ్యకతను తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

  • యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషన్, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) శాంతిని కేవలం యుద్ధం లేకపోవడంగానే కాకుండా, మానవాళి మేధోపరమైన, నైతిక ఐక్యతపై ఆధారపడిన ఒక శాశ్వత స్థితిగా నిర్వచించింది. భారత రాజ్యాంగంలో అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించడాన్ని ‘రాజ్య విధాన నిర్దేశక సూత్రాల్లో (Directive Principles of State Policy)’ చేర్చారు. 
  • అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించాలని; దేశాల మధ్య న్యాయపరమైన, గౌరవపరమైన సంబంధాలను కొనసాగించాలని ఆర్టికల్‌ 51 పేర్కొంటోంది. రాజ్య విధాన నిర్దేశక సూత్రాలు రాజ్యాంగంలోని నాలుగో భాగంలో, ఆర్టికల్‌ 36 నుంచి ఆర్టికల్‌ 51 వరకు పొందుపరిచి ఉన్నాయి. ఇవి న్యాయస్థానాల పరిధిలోకి రావు. రాజ్యాంగ నిర్మాతలు ఈ ఆలోచనను 1937 ఐరిష్‌ రాజ్యాంగం నుంచి స్వీకరించారు.
  • సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పీస్‌ (ఐఈపీ) అనే స్వచ్ఛంద సంస్థ 2026, జూన్‌లో ‘గ్లోబల్‌ పీస్‌ ఇండెక్స్‌ (జీపీఐ) - 2026’ను విడుదల చేసింది. సామాజిక భద్రత, స్థానిక-అంతర్జాతీయ సంఘర్షణలు, సైనికీకరణ తదితర 23 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని 163 దేశాలతో దీన్ని రూపొందించింది. ఈ ఇండెక్స్‌లో 2.409 స్కోరుతో భారత్‌ 127వ స్థానంలో నిలిచింది.
  • గత అయిదేళ్లలో (2020-25) ఏదో ఒక రూపంలో బాహ్య సంఘర్షణల్లో కనీసం పాక్షికంగానైనా పాలుపంచుకున్న దేశాల సంఖ్య 103కి చేరినట్లు ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పీస్‌ (ఐఈపీ) పేర్కొంది. 2008లో ఈ సంఖ్య 59గా ఉండేది. వీటి కారణంగా 9.5 కోట్ల మంది శరణార్థులుగా మారారు. దాదాపు 16 దేశాల్లో 5 శాతానికిపైగా జనాభా బలవంతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది.    

చారిత్రక నేపథ్యం

ప్రపంచవ్యాప్తంగా శాంతిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1981లో ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ ఏటా సెప్టెంబరులో వచ్చే మూడో మంగళవారం నాడు ‘అంతర్జాతీయ శాంతి దినోత్సవం’గా జరుపుకోవాలని తీర్మానించింది. 1982 నుంచి దీన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. హింసకు తావులేకుండా వివాదాలను పరిష్కరించడం దీని లక్ష్యమని యూఎన్‌ఓ పేర్కొంది. ఈ దినోత్సవాన్ని ఏటా సెప్టెంబరు 21న జరుపుకోవాలని 2001లో సూచించారు.

జీపీఐ 2026లో టాప్‌ - 10, లీస్ట్‌ 5 దేశాల జాబితా, ఇతర ముఖ్యాంశాలతోపాటు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-4, ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్, యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ - గ్రూప్‌-డి, ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ - సీజీఎల్, స్టెనోగ్రాఫర్, ఎంటీఎస్, యూజీసీ నెట్‌ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 60కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. గ్లోబల్‌ పీస్‌ ఇండెక్స్‌ - 2025లో భారత్‌ ర్యాంకు?

(దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌ (ఎగ్జిక్యూటివ్‌), 2025)

1) 100వ       2) 115వ       3) 110వ      4) 120వ

సమాధానం: 2

2. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పీస్‌ (ఐఈపీ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

(ఆర్‌ఆర్‌బీ ఆఫీస్‌ అసిస్టెంట్, 2019)

1) స్విట్జర్లాండ్‌     2) జర్మనీ    3) ఫ్రాన్స్‌        

4) అమెరికా       5) ఆస్ట్రేలియా

సమాధానం: 5

3. అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(బిహార్‌ పోలీస్‌ ఎస్‌ఐ, 2023), (యూపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ రీ-ఎగ్జామ్, 2024),

(యూపీ పోలీస్‌ ఎస్‌ఐ, 2021),

1) సెప్టెంబరు 21                2) అక్టోబరు 12

3) నవంబరు 19             4) డిసెంబరు 4

సమాధానం: 1

4. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51 దేనికి సంబంధించింది?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2022)

1) పౌరుల ఉమ్మడి పౌరస్మృతి

2) వ్యవసాయం, పశుపోషణ నిర్వహణ

3) అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించడం

4) కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేయడం

సమాధానం: 3

5. According to the Global Peace Index 2025, which of the following countries at the bottom, indicating the least peaceful nation?
(RRB Group D, 2025)
1) Yemen        2) Syria        3) Sudan        4) Russia
Ans: 4
6. What does a lower GPI score indicate?
(SSC Stenographer, 2025)
1) Higher level of peace        2) Greater military strength
3) Higher risk of war        4) Better environmental practices
Ans: 1
7. According to the Global Peace Index 2024, what is the role of Positive Peace in the context of violent conflict and economic instability?
(SSC CGL, 2025)
1) It measures the number of conflicts per country
2) It predicts military expenditure trend
3) It identifies structural factors that promote peace and can forecast declines in peacefulness
4) It calculates the percentage of GDP lost due to war
Ans: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram