రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపక దినోత్సవం

రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపక దినోత్సవం

రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) అనేది భారతదేశ భద్రతా వ్యవస్థలో కీలక భాగం. ఇది రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. రైల్వే ఆస్తులను రక్షించడం, ప్రయాణికుల భద్రతను నిర్ధారించడం దీని ప్రాథమిక విధి. సాధారణ రాష్ట్ర పోలీస్‌ బలగాలకు ఉండే అధికారాల లాంటివే కలిగి ఉన్న ఏకైక కేంద్ర సాయుధ పోలీసు దళం ఇదే. రైల్వే రక్షణ దళానికి భారతదేశ సాయుధ దళ హోదా లభించిన సెప్టెంబరు 20న ఏటా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) వ్యవస్థాపక దినోత్సవంగా నిర్వహిస్తారు. ప్రజా రక్షణతోపాటు ఆస్తుల సంరక్షణలో ఆర్‌పీఎఫ్‌ కృషిని గుర్తించడంతోపాటు ఆ సిబ్బందిని గౌరవించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

  • భారతదేశంలో మొట్టమొదటి రైలు ప్రయాణం 1853, ఏప్రిల్‌ 16న జరిగింది. గ్రేట్‌ ఇండియన్‌ పెనిన్సులర్‌ రైల్వే ఆధ్వర్యంలో ప్యాసింజర్‌ ట్రైన్‌ బొంబాయి నుంచి థానే వరకు 34 కి.మీ. ప్రయాణించింది. 1854 నాటికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రైల్వేలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం మొదటిసారి తూర్పు భారత రైల్వే 1861లో పోలీస్‌ చట్టాన్ని అమలుచేసి, రైల్వే రక్షణ కోసం పోలీస్‌ వ్యవస్థను తీసుకొచ్చింది.
  • 1951లో భారత రైల్వేను జాతీయం చేశారు. 1954లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వాచ్‌ అండ్‌ వార్డ్‌ వ్యవస్థను ఒక చట్టబద్ధమైన సంస్థగా పునర్‌వ్యవస్థీకరించాలని సిఫార్సు చేసింది. ఫలితంగా 1957లో పార్లమెంట్‌ రైల్వే రక్షక దళ చట్టాన్ని ఆమోదించడంతో, ఆర్‌పీఎఫ్‌ను ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో రైల్వే వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. రైల్వే నెట్‌వర్క్‌ భారీగా విస్తరించింది.
  • రైల్వేల్లో మెరుగైన భద్రత, పోలీస్‌ పర్యవేక్షణ వ్యవస్థ అవసరాన్ని గుర్తించి 1966లో రైల్వే ఆస్తి (అక్రమ స్వాధీనం) చట్టాన్ని (Railway Property (Unlawful Possession) తీసుకొచ్చారు. దీని ద్వారా రైల్వే ఆస్తులను చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకున్న నేరస్థులను విచారించడానికి, అదుపులోకి తీసుకోవడానికి ఆర్‌పీఎఫ్‌కు అధికారం కల్పించారు. 1985లో ఆర్‌పీఎఫ్‌ చట్టం, 1957కు సవరణలు చేసి, ఆర్‌పీఎఫ్‌ను సాయుధ దళంగా మార్చారు.
  • 2003లో ప్రభుత్వం ఆర్‌పీఎఫ్‌ చట్టం, రైల్వేల చట్టాన్ని సవరించింది. దాని ద్వారా ప్రయాణికుల భద్రత బాధ్యతతోపాటు రైల్వేల చట్టం కింద విచారణ జరిపే, చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించారు. దీని ద్వారా ప్రయాణికుల రైళ్లకు రక్షణ (ఎస్కార్ట్‌) కల్పించడం, రైల్వే స్టేషన్లలో ప్రవేశ నియంత్రణ లాంటి విధులను ఆర్‌పీఎఫ్‌ పాక్షికంగా చేపట్టింది. 2026, మార్చి నాటికి భారతీయ రైల్వేకు దేశవ్యాప్తంగా సుమారు 8 వేల రైల్వేస్టేషన్లు ఉన్నాయి.

చారిత్రక నేపథ్యం

1985, సెప్టెంబరు 20న 1957 నాటి చట్టానికి సవరణలు చేసి ఆర్‌పీఎఫ్‌ను భారత యూనియన్‌ సాయుధ దళంగా మార్చారు. అప్పటి నుంచి ఇది రైల్వే మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేసే కేంద్ర సాయుధ పోలీసు దళంగా రూపొందింది. దీనికి గుర్తుగా ఏటా ఆ తేదీన ‘రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపక దినోత్సవంగా’ నిర్వహిస్తున్నారు.

ఆర్‌పీఎఫ్‌ నినాదం: యశో లాభస్వ (Attain Glory)

ఆర్‌పీఎఫ్‌ అధికారాలు - విధులు, సిబ్బంది, దాని పరిధిలో ఉండే విభాగాలు తదితర సమాచారంతోపాటు గతంలో ఐబీపీఎస్‌ పీవో మెయిన్స్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ లాంటి పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారతీయ రైల్వేను కింది ఏ సంవత్సరంలో జాతీయం చేశారు?

(డీఎఫ్‌సీసీఐఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆపరేటింగ్, 2016)

1) 1924        2) 1948       3) 1960       4) 1951

సమాధానం: 4

2. భారతీయ రైల్వేను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌ 1, 2024)

1) 1851          2) 1853           3) 1852           4) 1850

సమాధానం: 2

3. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) మొదటి మహిళా డైరెక్టర్‌ జనరల్‌గా కింది ఎవరు నిలిచారు?

(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2025)

1) రష్మి శుక్లా                 2) సోనాలి మిశ్రా

3) నీనా సింగ్‌                4) అర్చనా రామసుందరం

సమాధానం: 2

4. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ‘ఆపరేషన్‌ నన్హే పరిష్ఠే (Operation Nanhe Farishtey)’ను ఎప్పుడు ప్రారంభించింది?

(ఎంపీ ఎక్సైజ్‌ కానిస్టేబుల్, 2025)

1) 2017       2) 2018       3) 2016       4) 2019

సమాధానం: 2

5. What was the route length of Indian Railways in 2019-2020?
(RRB NTPC (Graduate) CBT-I, 2026)
1) 66,918 km        2) 67,415 km        3) 66,935 km        4) 67,956 km
Ans: 4
6. The Railway Protection Force (RPF) launched a dedicated RPF Women Squad named as 'Joymati Bahini' at Kamkhaya Railway Station in ________on 23 January 2019.
(Delhi Police Constable (Executive), 2025)
1) Guwahati            2) Gangtok            3) Shillong
4) Dispur            5) Aizwal
Ans: 1
7. The first railway service in India started on 16 April 1853 and covered:
(DFCCIL Jr. Executive (Operation and BD) 2021)
1) 30 km        2) 34 km        3) 26 km        4) 23 km
Ans: 2
8. Indian Railway has introduced Automatic Train Protection (ATP) system called 'Kavach' for enhancing safety. Who has developed this technology?
(MPSC Group C (Mains) Combined Exam, 2023)
1) ISRO        2) DRDO         3) Indian Railway        4) RDSO 
Ans: 4 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram