ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం

ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న సంఘర్షణలు, దేశాల మధ్య యుద్ధాల వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు, శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతోంది. ఘర్షణల కారణంగా అతలాకుతలమైన దేశాల్లో శాశ్వత శాంతి పరిస్థితుల కల్పనలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం కృషికి గుర్తుగా ఏటా మే 29న ‘ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం’ (International Day of UN Peacekeepers) నిర్వహిస్తారు. యుద్ధ వాతావరణం ఉన్న ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి, కొనసాగించడానికి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకులు చేసే అవిశ్రాంత కృషిని గుర్తించడంతోపాటు వారికి మద్దతు తెలపడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ అంటే?

  • ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రతలను కాపాడేందుకు ఐక్యరాజ్యసమితి ఉపయోగించే ఒక యంత్రాంగమే ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ. ఇది ప్రధానంగా కాల్పుల విరమణలు, శాంతి ఒప్పందాలు, శాశ్వత శాంతికి మద్దతు ఇచ్చేందుకు ఘర్షణ ప్రాంతాలకు తన సిబ్బందిని (సైనికులు, పోలీసులు) పంపుతుంది. హింససు రూపుమాపి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి ఇది ఒక కీలకమైన సాధనం. అలాగే, యుద్ధ నివారణ, శాంతి నిర్మాణం లాంటి ఐక్యరాజ్యసమితి ప్రయత్నాల్లో భాగంగా పనిచేస్తుంది.
  • దేశాల మధ్య సంఘర్షణలు తొలగించి, శాంతిని నెలకొల్పడంలో సాయం చేసేందుకు 1948లో మొదటి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్‌ ప్రారంభమైంది. ఇందులో బ్లూ హెల్మెట్స్‌ అని పిలిచే శాంతి పరిరక్షకులు ఉంటారు. వీరంతా ఐక్యరాజ్యసమితి జెండా కింద పనిచేసే వివిధ దేశాలకు చెందిన సైనికులు, పోలీసులు, నిపుణులు. వీరు కాల్పుల విరమణలను పర్యవేక్షిస్తారు, ప్రజలను రక్షిస్తారు, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు మద్దతు ఇస్తారు.

శాంతి పరిరక్షక సిబ్బంది

  • ఐక్యరాజ్యసమితికి శాశ్వత సైన్యం లేదు. సభ్యదేశాలు స్వచ్ఛందంగా దీనికి సైనిక, పోలీస్‌ బలగాలను అందిస్తాయి. యూఎన్‌ఓతో ఆయా దేశాలకు ఉన్న ఒప్పందాలు, వ్యక్తిగత ప్రతిభ, నిర్దిష్ట కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా సిబ్బంది ఎంపిక ఉంటుంది.  
  • 2026 నాటికి యూఎన్‌ శాంతి పరిరక్షణకు అతిపెద్ద సహకారం అందిస్తోన్న ఆరు దేశాలు: నేపాల్, రువాండా, బంగ్లాదేశ్, భారత్, ఇండోనేసియా, పాకిస్థాన్‌.
ఐక్యరాజ్యసమితి సంధి పర్యవేక్షణ సంస్థ ఏర్పాటు, శాంతి పరిరక్షక సిబ్బంది, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ - భారతదేశం, ‘యూఎన్‌ మిలటరీ జెండర్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు తదితర సమాచారంతోపాటు ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ లాంటి పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌. పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ సీఆర్‌ఈ, 2025)

1) మార్చి 18    2) మే 29        3) జులై 12     4) జూన్‌ 7

సమాధానం: 2

2. బ్లూ హెల్మెట్స్‌ అంటే?

(సీడీఎస్‌ జనరల్‌ నాలెడ్జ్, 2022)

1) ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకులు        2) హింసాత్మక ప్రభుత్వేతర శక్తులు

3) పౌరసమాజ సంస్థలు                4) పర్యావరణ సంస్థలు

సమాధానం: 1

3. With reference to the UN peacekeeping operations, consider the following statements :
i. UN peacekeepers can use force only for their self-defense.
ii. Peacekeeping operations can only be withdrawn by a resolution by the UN Security Council.
iii. USA is the largest budget contributor to the UN peacekeeping operations.
Which of the statements given above is/are above correct?
(67th BPSC Prelims Set - D (Re-Exam) 2022)
1) ii and iii only        2) iii only        3) i, ii and iii        
4) i and ii only        5) None of the above/More than one of the above
Ans: 1
4. With reference to India's legacy in United Nations peacekeeping operations, consider the following statements.
i. The term Blue Helmets for UN peacekeepers is derived from the light blue colour of the United Nations flag.
ii. In 2023, the Dag Hammarskjöld Medal was posthumously awarded to Indian peacekeepers Shishupal Singh and Sanwala Ram Vishnoi, and civilian UN worker Shaber Taher Ali for their sacrifice in the Democratic Republic of the Congo.
iii. Major Radhika Sen was named the UN's "Military Gender Advocate of the Year 2023".
Which of the statements given above are correct?
(AFCAT Official Paper 2026)
1) i and iii only        2) i, ii and iii    3) i and ii only        4) ii and iii only
Ans: 2
5. Which of the following statements are true about the UN peace-keeping?
A. Its provisions are not explicitly given in the UN Charter
B. It is the sole prerogative of the Secretary-General of the UN
C. It has undergone quantitative and qualitative changes in the post-cold war period
D. India and America have jointly sponsored it
Choose the correct answer from the options given below:
(UGC NET Paper 2: Political Science 2021)
1) B and C only        2) A and D only        
3) A and C only        4) C and D only
Ans: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram