వరల్డ్‌ మెట్రాలజీ డే

వరల్డ్‌ మెట్రాలజీ డే

కొలతలు మన నిత్యజీవితంలో ఒక ప్రధాన భాగం. నాగరికత అభివృద్ధి చెందినప్పటి నుంచి మనిషి కొలవడం ప్రారంభించాడు. వివిధ భౌతిక పదార్థాల పరిమాణాలను లెక్కించడానికి, పోల్చడానికి, అర్థం చేసుకోవడానికి ఇవి అవసరం. కొలతలు లేకుండా వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాలు అసాధ్యం. మన దైనందిన జీవితంలో కొలతలశాస్త్రం ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో ఏటా మే 20న ‘వరల్డ్‌ మెట్రాలజీ డే’గా నిర్వహిస్తారు. కొలతలశాస్త్రం అంటే ఏమిటి, ఇది మన రోజువారీ కార్యక్రమాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ప్రజలకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

మెట్రాలజీ అంటే?

  • మెట్రాలజీ అనేది గ్రీకు పదాలైన ‘మెట్రాన్‌’, ‘లోగోస్‌’ నుంచి ఉద్భవించింది. దీని అర్థం కొలతల అధ్యయనం.
  • ఇది యూనిట్లు, కొలత పరికరాల కోసం సాధారణ ప్రమాణాలను నిర్దేశించడానికి వీలు కల్పిస్తుంది. నావిగేషన్, నిర్మాణాలు, ఉత్పత్తి, అభివృద్ధి, పర్యావరణ పర్యవేక్షణ, వైద్యం, ఆహార ప్రాసెసింగ్‌ లాంటి అనేక రంగాల్లో మెట్రాలజీకి విస్తృత శ్రేణి అనువర్తనాలు ఉన్నాయి
  • పదార్థం లేదా వస్తువు స్వభావం ఆధారంగా కొలిచేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన ప్రమాణాలు ఉంటాయి. కచ్చితమైన, విశ్వసనీయమైన కొలతలు అందించడమే మెట్రాలజీ ముఖ్య ఉద్దేశం
  • అందుకే తగినంత స్థాయి విశ్వసనీయత, నమ్మకాన్ని అందించేందుకు, చట్టబద్ధమైన కొలమాన కార్యకలాపాల నిర్వహణను ప్రభుత్వాలు స్వయంగా లేదా వాటి పర్యవేక్షణతో నిర్వహిస్తాయి
  • వస్త్రాన్ని మీటర్లలో కొలిస్తే, నీటిని లీటర్లలో, భూమిని గజాల్లో, ధాన్యాన్ని కిలోల్లో, సమయాన్ని గంటల్లో లెక్కిస్తారు. 

కొలత..

  • తెలియని పరిమాణాన్ని తెలిసిన ప్రామాణిక ప్రమాణంతో పోల్చడాన్ని కొలత అంటారు. మ్యాథమెటిక్స్, సైన్స్‌కు కొలతలు మూలస్తంభాలుగా పనిచేస్తాయి
  • ఇవి వస్తువులు లేదా సంఘటనల వివిధ లక్షణాలను పరిమాణీకరించడానికి(quantify), పోల్చడానికి ఒక పద్ధతిని అందిస్తాయి. 

ప్రమాణాలు: ప్రతి కొలతకు నిర్దిష్టమైన ప్రమాణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైన వాటిని పరిశీలిస్తే..

  • కాలం - దీన్ని సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు లాంటి ప్రమాణాలతో వ్యక్తపరుస్తారు.
  • పొడవు - మిల్లీమీటర్లు, సెంటీమీటర్లు, మీటర్లు, కిలోమీటర్లు లాంటి ప్రమాణాలతో కొలుస్తారు.
  • బరువు - గ్రాములు, కిలో గ్రాములు, టన్నులు లాంటి వాటితో చెబుతారు.
  • ఘనపరిమాణం - ఒక పదార్థం (ఘన, ద్రవ, వాయువు) ఆక్రమించిన మొత్తం స్థలాన్ని ఘనపరిమాణం అంటారు. దీన్ని ఘనపు మీటర్లు (ఘ.మీ.) లేదా ఘనపు సెంటీమీటర్లలో (ఘ.సెం.మీ.) సూచిస్తారు. 
  • ఉష్ణోగ్రత - దీనికి సంబంధించిన ముఖ్యమైన ప్రమాణాలు సెంటిగ్రేడ్, ఫారెన్‌హీట్‌

చారిత్రక నేపథ్యం

  • ప్రపంచవ్యాప్తంగా ఏకరీతి కొలతలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 1875, మే 20న పారిస్‌లో ఒక అంతర్జాతీయ సమావేశం జరిగింది. దీన్నే ‘మీటర్‌ కన్వెన్షన్‌’ అంటారు. అందులో కొలతలను నిర్ధారించేందుకు ఇంటర్నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ వెయిట్స్‌ అండ్‌ మెజర్స్‌ (బీఐపీఎం) అనే అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలని సమావేశంలో పాల్గొన్న 17 దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు
  • దీనికి గుర్తుగా 1999, అక్టోబరులో జరిగిన 21వ జనరల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ వెయిట్స్‌ (సీజీపీఎం)లో ఏటా మే 20న ‘వరల్డ్‌ మెట్రాలజీ డే’గా జరపాలని తీర్మానించారు.
ప్రాథమిక ప్రమాణ పద్ధతులు, SI పద్ధతిలో ప్రమాణాలు, అంతర్జాతీయ సంస్థలు, భారతదేశంలో దీనికి సంబంధించిన చట్టాలు లాంటి పూర్తి సమాచారంతోపాటు ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, యూజీసీ నెట్‌ తదితర పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌... ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’లో అందుబాటులో ఉన్నాయి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

 గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. మెట్రాలజీలో అత్యంత ముఖ్యమైన పెరామీటర్‌ ఏమిటి?
(ఎంపీ సబ్‌ ఇంజినీర్‌ మెకానికల్, 2017)

1) పరిమాణం         2) వ్యాసం

3) జ్యామితి           4) పొడవు

సమాధానం: 4

2. ‘వరల్డ్‌ మెట్రాలజీ డే’ని ఎప్పుడు నిర్వహిస్తారు?
(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2019)

1) జనవరి 25    2) ఏప్రిల్‌ 18

3) మే 20       4) ఫిబ్రవరి 17

సమాధానం: 3

3. What is the SI unit of 'volume'?
(RRB ALP CBT-II (Fitter), 2025)

1) Cubic metre         2) Cubic centimetre

3) Litres              4) Millilitres

Ans: 1

4. International Bureau of Weights and Measures is located in ______.
(DSSSB TGT Maths, 2018)

1) Finland              2) France

3) Switzerland           4) Norway

Ans: 2

5. Metrology is the study of 
(UGC NET 2022)

1. Chronology of coins

2. Study of weather

3. The measurement and arrangement of coins by weight

4. Study of metal

Ans: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram