పురాతన కళాఖండాలు, శిల్పాలు, కళాత్మక రచనలు, సంస్కృతి - సంప్రదాయాలను ప్రతిబింబించే అనేక రకాల వస్తువులను భద్రపరిచే ప్రదేశమే మ్యూజియం. ఇవి మానవాళికి వారసత్వ సంపదలు, చరిత్ర, సైన్స్, సంస్కృతులను తెలిపే విద్యా కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. పూర్వం జరిగిన అనేక సంఘటనలు, కార్యకలాపాలు, జ్ఞాపకాలకు మ్యూజియాలు చారిత్రక ఆధారాలుగా ఉంటాయి. మన చరిత్ర, సంస్కృతులను తర్వాతి తరాలకు అందించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. సమాజ అభివృద్ధిలో మ్యూజియంల పాత్ర గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 18న ‘ఇంటర్నేషనల్ మ్యూజియం డే’గా నిర్వహిస్తారు.
మ్యూజియంల ఆవశ్యకత..
చారిత్రక నేపథ్యం
సాంస్కృతిక మార్పిడి - పరిరక్షణ, సామాజిక అభివృద్ధిలో మ్యూజియంలు పోషించే కీలక పాత్రను తెలియజేసేలా ఒక తేదీని ఏర్పాటు చేయాలని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ (ఐసీఓఎం) భావించింది. అందుకు అనుగుణంగా 1977లో రష్యాలోని మాస్కోలో జరిగిన ఐసీఓఎం సర్వసభ్య సమావేశంలో ఏటా మే 18న ‘ఇంటర్నేషనల్ మ్యూజియం డే’గా నిర్వహించాలని తీర్మానించారు.
| ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్, భారతదేశంలో ప్రముఖ మ్యూజియాలు - వాటి ప్రత్యేకతలు, ఎప్పుడు ఏర్పాటయ్యాయి లాంటి పూర్తి సమాచారంతోపాటు ఈ టాపిక్ గురించి ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ మొదలైన పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్... ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ఇంటర్నేషనల్ మ్యూజియం డేను ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(డీడీఏ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి, 2020)
1) మే 9 2) మే 17
3) మే 12 4) మే 18
సమాధానం: 4
2. సాలార్‌జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది?
(ఎన్‌టీపీసీ టైర్ 1, 2016)
1) కోల్‌కతా 2) అహ్మదాబాద్
3) దిల్లీ 4) హైదరాబాద్
సమాధానం: 4
3. What is the provision of Article 49 of the Constitution of India?
(SSC CHSL 2020)
1) Provision for free and compulsory education for children
2) Promotion of international peace and security
3) Prohibition of employment of children (Under the age of 14) in factories and mines
4) Protection of monuments and places and objects of national importance
Ans: 4
4. Which Article of the Indian Constitution mandates that the state should protect every monument or place of artistic or historic interest?
(SSC MTS 2023)
1) Article 39A 2) Article 50 3) Article 49 4) Article 48A
Ans: 3
5. What is the theme of the International Museum Expo 2023?
(UPSSSC VDO 2023)
1) Celebrating Heritage
2) Museums, Sustainability and Well - being
3) Art and Culture Showcase
4) Well-being through Museums
Ans: 2