పూర్వం దూర ప్రాంతాల్లో నివసించే వారికి సమాచారాన్ని చేరవేయడం ఎంతో ప్రయాసతో కూడుకుని ఉండేది. అయితే కొన్ని దశాబ్దాలుగా సమాచార మార్పిడిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. మొబైల్, ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా సమాచారాన్ని పంపడం, స్వీకరించడం, పంచుకోవడం సర్వసాధారణమైంది. దీని వల్ల సమయం, డబ్బు ఆదా అయ్యాయి. దేశాలు ప్రగతి పథంలో పయనించడంలోనూ సమాచార వ్యవస్థలు తోడ్పాటు అందిస్తున్నాయి. ఇంటర్నెట్, ఇతర సమాచార సాధనాల ఉపయోగాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతో ఏటా మే 17న ప్రపంచ టెలీకమ్యూనికేషన్ దినోత్సవాన్ని (World Telecommunication Day) నిర్వహిస్తారు. దీన్నే ‘వరల్డ్ టెలీకమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే’ అని కూడా అంటారు. టెలీకమ్యూనికేషన్, సమాచార వ్యవస్థలు ఆర్థిక, సామాజిక వ్యవస్థలకు అందించే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
భారతదేశంలో టెలీకమ్యూనికేషన్
| మన దేశంలో టెలీకమ్యూనికేషన్ చరిత్ర, టెలీ కమ్యూనికేషన్ అభివృద్ధికి చేపట్టిన చర్యలు, ట్రాయ్ ఏర్పాటు, ఇంటర్నెట్ సేవల తీరుతెన్నులు, చట్టాలు, భారత్ నెట్ ప్రాజెక్టు, గణాంకాలతోపాటు ఈ టాపిక్ గురించి ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, యూపీఎస్సీ సివిల్స్ లాంటి పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్... ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం వెంటనే ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ప్రపంచ టెలీకమ్యూనికేషన్ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(నేవీ ట్రేడ్స్‌మాన్ మేట్, 2024),(WBPSC Miscellaneous 2023)
1) మే 16 2) మే 17 3) మే 18 4) మే 19
సమాధానం: 2
2. భారతదేశంలో టెలికాం రంగానికి నియంత్రణ సంస్థ ఏది?
(యూపీ పీజీటీ (ఎకనామిక్స్), 2021)
1) ట్రాయ్ 2) సెబీ 3) హెచ్‌టీఎంఎల్ 4) బీఎస్‌ఎన్‌ఎల్
సమాధానం: 1
3. In India, which one of the following is responsible for the implementation of the Government of India's policy in all matters concerning telecommunications?
(CDS General Knowledge 2022)
1) Digital Communications Commission
2) Telecom Regulatory Authority of India
3) Telecom Advisory Committee
4) Telecommunications Consultants India Limited
Ans: 1
4. Who chaired the Telecom Regulatory Authority of India (TRAI) in 2024?
(Delhi Police Constable (Executive) 2026)
1) P. D. Vaghela 2) Anil Kumar Lahoti
3) Subodh Kumar Singh 4) A. K. Bhalla
Ans: 2
5. What is the position of India in the world’s telecommunication market, as of March 2024?
(SSC CGL 2024)
1) Fourth 2) Third 3) First 4) Second
Ans: 4
6. In 2024, the Government of India replaced the Indian Telegraph Act, 1885 by enacting a new law to modernise the telecom sector. What is the name of this new legislation?
(RRB NTPC Graduate Level CBT-I 2025)
1) Bharat Telecom Services Act, 2023
2) Information Infrastructure Modernization Act, 2024
3) The Telecommunication Act, 2023
4) Digital Communication Reform Act, 2024
Ans: 3