కళ అనేది ఒక అద్భుత సృష్టి. మానవుడు ఆలోచనలు, భావాలు, అంతర్‌బుద్ధి (intuition), కోరికలను వ్యక్తపరచడానికి దీన్ని సృష్టిస్తాడు. మనం చూసే భౌతిక ప్రపంచాన్ని మాత్రమే కాకుండా మానవత్వం, సమాజం, ఆధ్యాత్మికతలతో సహా మొత్తం ప్రపంచాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడంలో కళ తోడ్పడుతుంది. సంస్కృతిలో భాగంగా ఉండి, వారసత్వ సంపదకు ప్రతిరూపమైన కళల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా ఏప్రిల్ 15న ‘ప్రపంచ కళా దినోత్సవం’గా (World Art Day) నిర్వహిస్తారు. కళాకారులను గౌరవించడంతోపాటు మానవ జీవితాల్లో కళ ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
కళ అంటే?
భారతదేశంలో కళలు..
భారతీయ కళ అతి ప్రాచీనమైంది. క్రీ.పూ.10,000 కాలానికి చెందిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనానికి అద్దం పట్టేలా గీసిన తొలి చిత్రాలు (చిత్రలేఖనం) మధ్యప్రదేశ్‌లోని భీంబెట్కలో లభ్యమయ్యాయి. సింధు నాగరికత, అజంతా - ఎల్లోరా గుహలు, వివిధ రాజుల కాలంలో నిర్మించిన కట్టడాలు మొదలైనవన్నీ మన కళలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
వాస్తుశిల్ప కళలు..
చరిత్ర పూర్వ కళ నుంచి మొగల్ రూపకల్పనల వరకు భారతీయ వాస్తుశిల్పం గొప్ప వైవిధ్యంతో విలసిల్లింది. సింధులోయ నిర్మాణాలు, బౌద్ధ స్తూపాలు, జైన దేవాలయాలు, గుప్తుల కాలం నాటి శిల్పాలు, చోళుల కళలు, ఇండో - ఇస్లామిక్ ఆకృతులు మొదలైనవన్నీ మన శిల్ప కళకు సజీవ సాక్ష్యాలు.
చారిత్రక నేపథ్యం:
2011లో మెక్సికోలోని గ్వాడలజారాలో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఆర్ట్ (ఐఐఏ) 17వ సర్వసభ్య సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా కళల కోసం ఒక ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవాలని మొదటిసారి ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా 1452, ఏప్రిల్ 15న ఇటలీలో జన్మించిన ప్రసిద్ధ కళాకారుడు లియొనార్డో డా విన్సీ జ్ఞాపకార్థం ఏటా ఆ తేదీని ‘ప్రపంచ కళా దినోత్సవం’గా జరుపుకోవాలని నిర్ణయించారు. ఆ విధంగా మొదటి ‘వరల్డ్ ఆర్ట్ డే’ని 2012లో నిర్వహించారు.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు..
1. ప్రపంచ కళా దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(యూపీ పోలీస్ కానిస్టేబుల్ రీ-ఎగ్జామ్, 2024)
1) ఏప్రిల్ 16 2) ఏప్రిల్ 15
3) ఏప్రిల్ 13 4) ఏప్రిల్ 14
సమాధానం: 2
2. మధుబని చిత్రకళా శైలి కింది ఏ రాష్ట్రానికి చెందింది?
(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ టైర్ 1, 2023)
1) గుజరాత్ 2) కర్ణాటక 3) బిహార్ 4) రాజస్థాన్
సమాధానం: 3
3. Kalamkari painting is related to which state?
(RPF SI, 2019), (RPF Constable, 2019)
1) Andhra Pradesh 2) Manipur
3) West Bengal 4) Maharashtra
Ans: 1
4. Which of the following is correct about Nagara or North Indian Temple Style Architecture?
(SSC MTS, 2022)
1) There were no tower or shikhara.
2) It has elaborate boundary walls.
3) There was no Kalasha, the topmost part of the temple.
4) The garbhagriha is always located directly under the tallest tower.
Ans: 4
5. Which of the following temple architectural features is characteristic of the Nagara style, especially found in central and northern India?
(SSC CGL 2025)
1) Vimana 2) Shikhara
3) Mandapa with barrel vaults 4) Gopuram
Ans: 2