ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌

ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌

విశ్వ రహస్యాలు ఎప్పటికీ ఆసక్తికరమే. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మానవుడు భూమికి ఆవల ఉన్న విషయాలను తెలుసుకోవడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాడు. విశ్వం గుట్టు ఛేదించడానికి నిరంతరం అంతరిక్ష అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా చేపట్టిన మానవసహిత అంతరిక్ష యాత్ర స్పేస్‌ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి కారణమైంది. అసాధ్యమైనవాటిని సైతం సుసాధ్యం చేయొచ్చని ఇది నిరూపించింది. మానవ అంతరిక్ష యాత్ర ప్రారంభానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్‌ 12న ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌’గా నిర్వహిస్తారు. అంతరిక్షశాస్త్ర ప్రాముఖ్యం, స్థిరమైన అభివృద్ధిని సాధించడంలో సాంకేతికత పాత్ర మొదలైన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

చారిత్రక నేపథ్యం..

రష్యన్‌ వ్యోమగామి యూరి గగారిన్‌ 1961, ఏప్రిల్‌ 12న వోస్టాక్‌ 1 అంతరిక్ష నౌక ద్వారా మొదటి మానవ అంతరిక్షయానం చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రపంచ దేశాలన్నీ మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలపై దృష్టి సారించాయి. 2011, ఏప్రిల్‌ 7న ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ) జనరల్‌ అసెంబ్లీ ఏటా ఏప్రిల్‌ 12న ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌’గా నిర్వహించాలని తీర్మానించింది. తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఆ ఏడాది 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram