‘ఐసీఎంఆర్‌-నిన్‌ సంపద 2023-25’ సర్వే

‘ఐసీఎంఆర్‌-నిన్‌ సంపద 2023-25’ సర్వే

దేశవ్యాప్తంగా జనాభా ఆరోగ్యం, శారీరక శ్రమ, ఆహారం, శరీర కొలతల సూచికల అంచనాకు 2023-25 మధ్య భారత వైద్య పరిశోధన మండలి-జాతీయ పోషకాహార సంస్థ(ఐసీఎంఆర్‌-నిన్‌) సర్వే ఫర్‌ అసెస్‌మెంట్‌ ఆఫ్‌ మార్కర్స్‌ ఆఫ్‌ పాపులేషన్‌ హెల్త్, యాక్టివిటీ, డైట్, ఆంత్రోప్రోమెట్రీ (సంపద) పేరుతో సర్వే నిర్వహించింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆరోగ్య పరిశోధన విభాగం 2026, నవంబరు 24న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 183 జిల్లాల్లో 81 వేల కుటుంబాలకు చెందిన 2 లక్షల మందిని సర్వే చేసి.. 1.74 లక్షల మంది నుంచి సేకరించిన రక్త నమూనాలను విశ్లేషించి ఈ వివరాలను వెల్లడించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram