‘నేషనల్‌ హెల్త్‌ అకౌంట్స్‌ 2022-23’ నివేదిక

‘నేషనల్‌ హెల్త్‌ అకౌంట్స్‌ 2022-23’ నివేదిక
  • దేశంలో ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం చేసే వ్యయం పెరగడంతో, ప్రజలు వైద్యం కోసం తమ జేబు నుంచి చేసే ఖర్చు తగ్గినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2013-14 పోలిస్తే, పదేళ్లలో ఆ తగ్గుదల 21 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వ వ్యయం 2013-14లో జీడీపీలో 1.15% ఉండగా, 2022-23కు అది 1.43%కి పెరిగింది.
  • కేంద్ర ప్రభుత్వం 2026, మే 27న విడుదల చేసిన ‘నేషనల్‌ హెల్త్‌ అకౌంట్స్‌ 2022-23’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం ప్రభుత్వ వ్యయంలో వైద్యం కోసం చేసిన ఖర్చు ఇదే సమయంలో 3.78% నుంచి 4.89%కి పెరిగినట్లు తెలిపింది. వైద్యం కోసం ప్రభుత్వం చేసిన తలసరి వ్యయం కూడా ఈ పదేళ్ల కాలంలో రూ.1,042 నుంచి రూ.2,786కు పెరిగిందని పేర్కొంది. మొత్తం వైద్య వ్యయంలో ప్రభుత్వం చేసిన ఖర్చు 28.6% నుంచి 43.7%కి పెరగడం వల్ల ప్రజలు తమ జేబుల్లోంచి చేసే ఖర్చు పదేళ్లలో 64.2% నుంచి 43.4%కి తగ్గినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram