ఎస్‌ఆర్‌ఎస్‌ 2024 నివేదిక

ఎస్‌ఆర్‌ఎస్‌ 2024 నివేదిక
  • ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం సంతాన సాఫల్య నిష్పత్తి (టీఎఫ్‌ఆర్‌) మరింత తగ్గినట్లు కేంద్ర జనగణన విభాగం తాజాగా వెల్లడించిన శాంపుల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం-2024 నివేదిక పేర్కొంది. దీని ప్రకారం 2023లో 1.5గా ఉన్న టీఎఫ్‌ఆర్‌.. 2024లో 1.4కు తగ్గింది. దేశవ్యాప్తంగానూ 16 పెద్ద రాష్ట్రాల్లో జనాభా సమతౌల్యాన్ని (రీప్లేస్‌మెంట్‌ లెవెల్‌) సాధించలేనంతగా టీఎఫ్‌ఆర్‌ పడిపోయింది.
  • జాతీయ స్థాయిలో సగటున 2.1 కంటే కిందికి జారింది. దిల్లీ (1.2), కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ (1.3), ఆంధ్రప్రదేశ్, జమ్మూ కశ్మీర్, పంజాబ్‌ (1.4), హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ (1.5), ఒడిశా (1.6), గుజరాత్, ఉత్తరాఖండ్‌ (1.7), అస్సాం, హరియాణా (1.9) రాష్ట్రాల్లో టీఎఫ్‌ఆర్‌.. రీప్లేస్‌మెంట్‌ స్థాయికంటే తక్కువగా ఉంది. బిహార్‌ (2.9), ఉత్తర్‌ప్రదేశ్‌ (2.6), మధ్యప్రదేశ్‌ (2.4), రాజస్థాన్‌ (2.3), ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌ (2.2)లలో మాత్రమే రీప్లేస్‌మెంట్‌ స్థాయికంటే ఎక్కువగా ఉంది.
  • ఏపీలో టీఎఫ్‌ఆర్‌ గ్రామాల్లో 1.5, పట్టణాల్లో 1.3గా ఉంది. తెలంగాణలో గ్రామాల్లో 1.6, పట్టణాల్లో 1.4గా నమోదైంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram