ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ని గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా సీఎం చంద్రబాబు 2026, మార్చి 18న ప్రారంభించారు. దివ్యాంగులు ఎలాంటి ఖర్చు లేకుండా అయిదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 12.75 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.6 వేల పింఛను ఇస్తోంది. తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి రూ.10 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేల చొప్పున పింఛను అందిస్తోంది.