భారత్‌కు ఇంటెల్‌ చిప్‌ టెక్నాలజీ

భారత్‌కు ఇంటెల్‌ చిప్‌ టెక్నాలజీ
  • భారత్‌లోకి సెమీకండక్టర్‌ సబ్‌స్ట్రేట్‌ తయారీ సాంకేతికత రానుంది. ఇందుకోసం చిప్‌ తయారీ దిగ్గజ సంస్థ ఇంటెల్, ఒడిశా ప్రభుత్వం, 3డీజీఎస్‌ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ, ఇంటెల్‌ సీఈఓ లిప్‌- బు టాన్‌ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
  • దాదాపు 3.3 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.30,000 కోట్ల) అంచనా వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్, దేశంలోనే అతిపెద్ద హై టెక్నాలజీ తయారీ పెట్టుబడుల్లో ఒకటిగా నిలవనుంది. కంప్యూటర్‌ చిప్‌ రంగంలో అగ్రగామి అయిన ఇంటెల్‌ కార్పొరేషన్, ప్రత్యక్ష భాగస్వామ్యంతో భారత్‌లో రాబోతున్న తొలి ప్రాజెక్ట్‌ ఇదే.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram