ప్రభుత్వానికి ఆర్‌బీఐ డివిడెండు 

ప్రభుత్వానికి ఆర్‌బీఐ డివిడెండు 

గత ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించి ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2.87 లక్షల కోట్ల డివిడెండును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అందించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెల్లించిన రూ.2.69 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 6.75% ఎక్కువ. 2025-26లో తమ నికర ఆదాయం రూ.3.96 లక్షల కోట్లు అని, 2024-25లో ఇది రూ.3.13 లక్షల కోట్లుగా ఉందని ఆర్‌బీఐ తెలిపింది. 2026 మార్చి 31 నాటికి ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీట్‌ 20.61% పెరిగి రూ.91,97,121.08 కోట్లకు చేరింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram