మేధో సంపత్తి హక్కుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వల్ల, మన దేశంలో పేటెంట్ దరఖాస్తుల ఫైలింగ్ 30.2 శాతం పెరిగి 1,43,729కు చేరాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ తెలిపారు. 2024-25లో ఇవి 1,10,375గా ఉన్నాయి. ప్రస్తుతం పేటెంట్ ఫైలింగ్‌లో భారత్, ప్రపంచంలోనే 6వ అతిపెద్ద దేశంగా ఉంది.
2025-26లో మన పేటెంట్ ఫైలింగ్స్ రికార్డు స్థాయిలో 1.43 లక్షలను దాటాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 30.2% ఎక్కువ.