యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)
  • 2026, మార్చి నెలలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీల విలువ రూ.30 లక్షల కోట్లకు చేరింది. డిజిటల్‌ చెల్లింపుల్లో ఇది ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 2016 ఏప్రిల్‌ 11న యూపీఐ సేవలను ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. వర్చువల్‌ పేమెంట్‌ అడ్రస్‌ (వీపీఏ) ద్వారా బ్యాంక్‌ ఖాతాలను లింక్‌ చేయడంతో, లావాదేవీలు చాలా సులభంగా మారాయి. ఎవరికైనా నగదు పంపాలన్నా, వారి బ్యాంక్‌ ఖాతా సంఖ్య, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ అవసరం లేకుండా పోయింది. ఒక వ్యక్తి మొబైల్‌ నంబరు/యూపీఐ ఐడీ ఉంటే, సురక్షిత ధ్రువీకరణ (సెక్యూర్‌ ఆథెంటికేషన్‌) వినియోగించి నగదు పంపొచ్చు లేదా స్వీకరించొచ్చు. రోజులో ఏ సమయంలో అయినా, రియల్‌ టైమ్‌లో ఆటంకాలు లేకుండా, నగదు పంపే వెసులుబాటు ఉండటంతో ఎక్కువ మంది యూపీఐ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. నగదుపై ఆధారపడటాన్ని యూపీఐ తగ్గించింది.
  • మన దేశంలో 2021లో 216 బ్యాంకులు యూపీఐ సదుపాయం కల్పిస్తుండగా, 2026 జనవరికి వీటి సంఖ్య 691కి చేరింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram