భారత క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (52 బంతుల్లో), ఫాస్టెస్ట్ సెంచరీ (28 బంతుల్లో) రికార్డును నెలకొల్పాడు. 2026, నవంబరు 24న దోహాలో జరిగిన రైజింగ్‌స్టార్స్ ఆసియాకప్‌లో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ దీన్ని సాధించాడు. అతడు కేవలం 53 బంతుల్లో 204 పరుగులు చేశాడు. ఇందులో 28 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో యూఏఈ.. 8 వికెట్లకు 249 పరుగులు సాధించింది. అయితే ప్రత్యర్థి 50 ఓవర్లు ఆడి, ఎంతో కష్టపడి సాధించిన ఆ స్కోరును.. వైభవ్ సంచలన ఇన్నింగ్స్‌తో భారత్ కేవలం 14.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది (254 పరుగులు).