ఇషా సింగ్‌కు స్వర్ణం

ఇషా సింగ్‌కు స్వర్ణం
  • ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో హైదరాబాద్‌ అమ్మాయి ఇషా సింగ్‌ ప్రపంచ రికార్డు బద్దలు కొడుతూ స్వర్ణం సాధించింది. 2026, మే 27న మ్యూనిక్‌లో జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఫైనల్లో ఆమె అగ్రస్థానంతో భారత్‌కు టోర్నీలో తొలి పతకం అందించింది.
  • 50 పాయింట్లకు 43 స్కోరు సాధించిన ఇషా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో కిమ్‌ యెజి (42 పాయింట్లు-కొరియా) రికార్డును ఆమె బద్దలు కొట్టింది. మాజీ ప్రపంచ ఛాంపియన్‌ డొరీన్‌ వెన్‌కాంప్‌ (జర్మనీ) రజతం, మిరోస్లోవా (బల్గేరియా) కాంస్యం గెలిచారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram